మిస్టర్‌ 'బిగ్‌' పర్‌ఫెక్ట్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌!

By iQlikMovies - August 14, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లోని మేల్‌ కంటెస్టెంట్స్‌లో డే వన్‌ నుండీ, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకున్న వారిలో రవికృష్ణ పేరు మొదటి వరుసలో ఉంటుంది. తమన్నా విషయంలో రవికృష్ణ పాఠించిన సహనం ఆయనపై విపరీతమైన పోజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఇప్పుడు బిగ్‌బాస్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని రాహుల్‌ సిప్లిగంజ్‌ పేరు మార్మోగిపోతోంది. సింగర్‌గా ఆయనకు మంచి పేరుంది. మొన్న వెన్నెల కిషోర్‌ గెస్ట్‌గా వచ్చినప్పుడు కూడా రాహుల్‌ భయ్యా బయట నీ పేరు మార్మోగిపోతోంది.. అని చెప్పాడు.

 

ఇక లేడీస్‌ విషయంలో రాహుల్‌ ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి రాహుల్‌ని చూస్తే, చిలిపితనం, కొంటెతనం, అల్లరితనం లాంటివి గుర్తొస్తుంటాయి. కానీ, అవన్నీ ఆయన బాడీ లాంగ్వేజ్‌లో మాత్రమే కనిపించే లక్షణాలు తప్ప, అమ్మాయిల పట్ల చాలా గౌరవప్రదంగా బిహేవ్‌ చేస్తున్నాడు. టాస్క్‌ల్లో కూడా ఎక్కడా లిమిట్స్‌ దాటడం లేదు. అమ్మాయిల్తో అలా ఎలా బిహేవ్‌ చేస్తాం భయ్‌ అంటూ దూరంగా ఉండిపోతున్నాడు. కానీ, ఈ ప్రవర్తన హౌస్‌లో మరి కొంతమందిని హర్ట్‌ చేస్తోంది.

 

వేరే రకంగా ప్రొజెక్ట్‌ అవుతోంది. పునర్నవి, వితిక విషయంలో ఒకలా, మిగిలిన అమ్మాయిల విషయంలో ఇంకోలా రాహుల్‌ ప్రవర్తిస్తున్నాడంటూ అషూ రెడ్డి తదితరులు అభిప్రాయ పడుతున్నారు. కానీ, కార్నర్‌ నుండి చూస్తే అర్ధమవుతుంది. అందరు ఆడవాళ్ల విషయంలోనూ రాహుల్‌ అలాగే ప్రవర్తిస్తున్నాడు. గత సీజన్‌లో కౌషల్‌ అలాగే వ్యవహరించాడు. అందుకే ఆయన్ని ఆ సీజన్‌కి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని అభివర్ణించాం. ఈ సీజన్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అని సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS