రాఖీతో పెట్టుకుంటే అంతే సంగతి!

మరిన్ని వార్తలు

ఏదో ఒక సెన్సేషనల్‌ న్యూస్‌తో క్రియేట్‌ చేసి, ఎప్పుడూ వార్తల్లో హాట్‌ టాపిక్‌ అయ్యే రాఖీ సావంత్‌ తాజాగా ఇంకోసారి హాట్‌ హాట్‌గా వార్తల్లో నిలిచింది. ఈ మధ్య ఈ హాట్‌ ఐటెం బాంబ్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని, ఫ్యాన్స్‌కి షాకిచ్చిన సంగతి తెలిసిందే. అంతుకు ముందు వరకూ తనపై వచ్చిన పెళ్లి గాసిప్స్‌ని ఖండిస్తూ వన్‌ ఫైన్‌ డే 'అవును నేను పెళ్లి చేసుకున్నాను..' అంటూ స్వీట్‌ న్యూస్‌ హాట్‌గా పేల్చింది.

 

ఇటీవల ఓ ఎన్నారైతో తన వివాహం అత్యంత సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా జరిగిందని రాఖీ ఒప్పుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ, ఫ్యాన్స్‌ కాబట్టి, జస్ట్‌ షాకయ్యి తేరుకున్నారు. కానీ, ఆమె మాజీ ప్రియుడు మాత్రం అంత తేలిగ్గా తేరుకోలేకపోయాడు. మాజీ ప్రియుడు దీపక్‌తో రాఖీసావంత్‌ వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఆ తర్వాత కొన్ని కారణాలతో రాఖీ, దీపక్‌ని వివాహమాడడం లేదని తెలిపింది. అదంతా గతం. కానీ, రాఖీ వివాహం గురించి తెలుసుకున్న దీపక్‌ ఆమెని టార్గెట్‌ చేశాడు.

 

తనకు రాఖీ కొంత డబ్బు బాకీ ఉందనీ, ఆ డబ్బు చెల్లించకపోతే, ఆమె జీవితం నాశనం చేస్తానంటూ ఆమెను హెచ్చరించాడు. అయితే, బెదిరిపోవడానికి అక్కడుంది లేడి పిల్ల. కాదు ఆడ పులి కదా. అస్సలు లెక్కే చేయలేదు రాఖీ సావంత్‌. ఆయన హెచ్చరికలకు ధీటుగా సమాధానం చెప్పింది. 'అరుంధతి' స్టైల్‌లో 'నువ్వు నన్నేం చేయలేవురా..' అంటూ తిప్పి కొట్టింది. రాఖీ సావంత్‌నా.? మజాకానా.? ఆమెతో పెట్టుకుంటే అంతే సంగతి మరి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS