టాలీవుడ్ లేటెస్ట్ క్రష్ మృణాల్ ఠాకూర్. మొదట సీరియల్స్ తో బాలీవుడ్ లో కెరియర్ మొదలు పెట్టి, హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో బాలివుడ్ లో మరికొన్ని ఆఫర్స్ అందుకుంది. అర్జున్ రెడ్డి కి రీమేక్ గా సందీప్ వంగా తెరెకెక్కించిన కభీర్ సింగ్ మూవీలో షాహిద్ కపూర్ తో హీరోయిన్ గా చేసింది. ఈ క్రేజ్ తో హను రాఘవపూడి సీతా రామం మూవీలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఈ సినిమాలో దుల్కర్, మృణాల్ జోడి మంచి మార్కులు కొట్టేసింది. సీతారామం లో మృణాల్ తన నటనతో అన్ని భాషల ప్రేక్షకులను ఫిదా చేసింది. దీనితో టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయి అమ్మడు ఫుల్ బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.
సీతారామం తరవాత న్యాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న చేసింది. ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యింది. దీనితో మృణాల్ పేరు మారుమోగింది. మృణాల్ లక్కీ గాళ్ అని తాను ఉంటే సినిమా గ్యారంటీ హిట్ అని టాక్ మొదలయ్యింది. హయ్ నాన్న తరవాత కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ లో మృణాల్ పేరు వినిపించింది. అందులో ఒకటి ప్రభాస్ హను రాఘవపూడి సినిమా ఒకటి. ప్రభాస్ సినిమాలో మృణాల్ నటిస్తే ఆమె దశ తిరిగినట్టే అనుకున్నారు అంతా. హాయ్ నాన్న తరవాత మృణాల్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేదు. దీనితో మృణాల్ ఫేమ్ డౌన్ అయిపోయింది. టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టాల్సిన మృణాల్ రెండు విజయాల తరవాత ఒక అపజయం చవి చూసింది.
దీంతో మళ్ళీ మృణాల్ కి అవకాశాలు తగ్గాయి. ఫ్యామిలీ స్టార్ వలన ఈ అమ్మడికి ఏం కలిసి రాకపోయినా, బాగా ముదరగా ఉంది కుర్ర హీరోలకి నప్పదు అనే ముద్ర పడిపోయింది. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా ఛాన్స్ కూడా పోయినట్టే. నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ కమిట్ అయినట్టు సమాచారం లేదు. ఇప్పుడు మృణాల్ మళ్ళీ బాలీవుడ్ లో ట్రై చేస్తుందా, లేదా సౌత్ లో మిగతా భాషల్లో కాన్సంట్రేషన్ చేస్తుందా అన్నది చూడాలి. సీనియర్ హీరోలకి మృణాల్ బెస్ట్ ఆఫ్షన్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.