ప్రశాంత్ వర్మ సీక్రెట్ ప్రాజెక్ట్

మరిన్ని వార్తలు

హనుమాన్ సినిమాతో స్టార్ హోదాకి చేరుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ మూవీ ఎంత ప్రభంజనాన్ని సృష్టించిందో తెలిసిందే.  ఈ మూవీతో పానిండియా దర్శకుడు అయిపోయాడు. నార్త్ ఆడియన్స్ ని కూడా మెప్పించ గలిగాడు. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ తో ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ కంటే వేయిరెట్లు బెస్ట్ అని ప్రశంసలు అందుకున్నాడు ప్రశాంత్. ఇప్పుడు హనుమాన్ తరవాత ఎలాంటి ప్రాజెక్ట్ తో, ఏ హీరోతో వస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు.  నెక్స్ట్ సీక్వెల్ గా హనుమాన్ 2  కూడా ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ కంటే ముందు ఇంకో ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని అలరించనున్నాడు.


ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆక్టోప‌స్ అనే సినిమాపై ద్రుష్టి పెట్టాడంట. ఇదేంటి సడెన్ గా అనుకుంటున్నారా? ఈ సినిమా హ‌నుమాన్‌ కంటే ముందే మొదలయ్యింది. షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తి అయిందని తెలుస్తోంది. కానీ ఎందుకో ఆ మూవీని మధ్యలో ఆపేసి `హ‌నుమాన్‌`ని ప‌ట్టాలెక్కించాడు. ఇప్పుడు మ‌ళ్లీ ‘ఆక్టోప‌స్‌’పై ఫోకస్ చేసాడు. మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నాడని టాక్. హనుమాన్ తో  తనకి వచ్చిన గుర్తింపుని ఈ సినిమాకి క్యాష్ చేసుకోవాలని వర్మ ఆలోచన.  


ఆక్టోపస్ మూవీ లేడి ఓరియెంటెడ్ అని సమాచారం. ఐదుగురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో కేరళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ది కీ రోల్. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రమని, రిలీజ్ కి ముందే చిత్రోత్స‌వాల‌కు పంపాల‌ని డిసైడ్ అయ్యాడట వ‌ర్మ‌. కచ్చితంగా ఇది అవార్డ్స్ సాదిస్తుందని, అక్క‌డ కొన్ని పురస్కారాలు సాధించిన త‌ర‌వాత‌, ఈ సినిమాని విడుద‌లయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. అందుకనే ‘ఆక్టోప‌స్‌’ గురించి పెద్దగా డీటెయిల్స్ బయటికి రానివ్వటం లేదని తెలుస్తోంది. ఆక్టోపస్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో ప్రశాంత్ వర్మ చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS