కొరటాల శివ హిట్ దర్శకుడు. ఆయన సినిమాలన్నీ హిట్లే. అంతేకాదు.. దాదాపు అన్నీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే. 'మిర్చి'లో గొడవలు వద్దుని చెప్పారు. 'శ్రీమంతుడు'లో గ్రామలని దత్తత తీసుకోమన్నారు. 'జనతా గ్యారేజ్' లో లవ్ ది నేచర్ అన్నారు. ఇక 'భరత్ అనే నేను'లో సిఏంగా సొసైటీని మార్చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే ఈ గ్యాప్ లో కొందరు మెగా ఫ్యాన్స్.. చాలా కాలంగా మెగాస్టార్స్ తో ట్రావెల్ అవుతున్న వ్యక్తులు కొందరు ... కొరటాలని పర్శనల్ గా కలిశారట. మెగా సినిమా విషయంలో వాళ్ళు కొరటాలకి చెప్పిన ఓ సంగతి చాలా ఆసక్తి కరంగా వుంది. ''సర్ మీ సినిమాలు బావుంటాయి. కానీ హీరో కొంచెం డిప్రషివ్ మూడ్ లో ఉంటాడు. ప్లీజ్ .. అన్నయ్యని మాత్రం చాలా యాక్టివ్ గా చూపించండి. ఆయనలో కోనసీమ కుర్రాడి కొంటెతనం వుంది. దాన్ని పట్టుకుంటే భలే వుంటుదండి'' అని ఓ విన్నపం లాంటి సలహా ఇచ్చారట. వాళ్ళు చెప్పిన మాటకు కొరటాల అక్కడిక్కడ ''సరే'' అని చెప్పి.. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన సినిమాల్లో హీరోని క్రాస్ చెక్ చేసుకుంటే.. వాళ్ళు చెప్పినదాంట్లో కొంత వాస్తవం వుందని తన టీంతో చెప్పుకున్నారట. నిజమే.. దాదాపు కొరటాల సినిమాల్లో హీరో.. ఏదో కోల్పోయినట్లు.. ఇంకా ఏదో సాదించాలన్నట్లుగా ఉంటాడు. సీరియస్ గా లాంగ్ పేస్ పెట్టుకొని నిలబడతాడు.
ఇప్పటికే 'సైరా'లో కావాల్సింత సీరియస్ నెస్ చూసేశారు మెగా ఫాన్స్. ఇప్పుడు ఇంక సీరియస్ మూడ్ నుండి బయటపడాలన్నది మెగా ఫాన్స్ ఆశ. చిరంజీవి ఆశ కూడా ఇదే. ''సైరా నాకో డిఫరెంట్ సినిమా. ఒక్క నవ్వు కూడా లేకుండా చేసిన షూటింగ్ ఇదే. ఇప్పుడే ఇంకొ సినిమా మొదలుపెట్టి డ్యాన్స్, కామెడీలు చేసేయాలని వుంది'' అని స్వయంగా చిరంజీవే సైరా ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఈ విషయంలో కొరటాల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.