బాలయ్య టైటిల్‌పై ఫ్యాన్స్‌ సీరియస్‌. కారణమేంటంటే.!

By Inkmantra - October 16, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలయ్య తాజా చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే, 'రూలర్‌' అనే టైటిల్‌ని కన్‌ఫామ్‌ చేస్తూ, ఈ సినిమా శాటిలైట్‌ హక్కుల్ని తాము దక్కించుకున్నామంటూ ప్రముఖ టీవీ ఛానెల్‌ జెమిని తమ ట్విట్టర్‌ పేజీలో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. ఈ అనౌన్స్‌మెంట్‌కి అంతా షాకయ్యారు. అదేంటీ..! చిత్ర యూనిట్‌ నుండి అఫీషియల్‌ కన్‌ఫామేషన్‌ రాకుండా, ఓ టీవీ ఛానెల్‌ ఎలా సినిమా టైటిల్‌ని ప్రకటిస్తుంది.? అంటూ పెద్ద చర్చే జరుగుతోంది.

 

ఇదిలా ఉంటే, ఈ సినిమాకి 'రూలర్‌' అనే టైటిల్‌ మొదట్లో ప్రచారమైనా, ఆ తర్వాత 'క్రాంతి', 'జడ్జిమెంట్‌'.. తదితర పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అలాంటిది, టైటిల్‌ కన్‌ఫామ్‌ చేస్తూ, ఓ టీవీ ఛానెల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వడంతో బాలయ్య అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. మరి ఈ అనౌన్స్‌మెంట్‌పై బాలయ్య అండ్‌ టీమ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో బాలయ్య డబుల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఓ పాత్ర కోసం పూర్తిగా యంగ్‌ అండ్‌ స్టైలిష్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లోకి మారిపోయాడు బాలయ్య. మరో పాత్ర చాలా పవర్‌ఫుల్‌ లుక్స్‌తో ఉంటుందనీ సమాచారమ్‌. ఆ లుక్‌ని ఇంకా చిత్ర యూనిట్‌ రివీల్‌ చేయలేదు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. బాలయ్యతో 'జై సింహా' తెరకెక్కించిన కె.ఎస్‌.రవికుమార్‌ ఈ సినిమాకి దర్శకుడు. డిశంబర్‌లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS