బాబు గోగినేని కి హేతువాదిగా పేరుంది. మీడియా చర్చల్లో ఆయన తరచూ పాల్గొంటారు. సైన్స్‌కి సంబంధించిన సూత్రాల్ని, మూఢ నమ్మకాల నిర్మూలనకు ఆయుధాలుగా వాడతారు. బిగ్ బాస్ హౌస్‌లోనూ అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ని చాలా హర్ట్ చేస్తున్నారు. ఈమధ్య పవన్ కల్యాణ్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఓ పోస్టర్‌ని వైరల్ చేశారు. పవన్ పడుకుని ఉంటే, వివేకానంద, చెగువెరా పరామర్శిస్తున్నట్టు ఉన్న ఫొటో అది. పవన్ కు వివేకానంద, చెగువేరా అంటే చాలా ఇష్టం. కాబట్టి.. పవన్ అభిమానులు అలా.... ఓ ఊహా చిత్రాన్ని చిత్రించుకున్నారు.
అయితే ఆ ఫొటోపై చాలా సెటైరికల్ కామెంట్లు చేశాడు గోగినేని. పవన్ పడుకున్న తీరుపై, పవన్ చదువుకున్న పుస్తకాల విషయంలోనూ.. సెటైర్లు వేశాడు. 49 ఏళ్ల యువ హీరో.. అంటూ ఎటకారమాడాడు. నెల్సన్ మండేలా, జీసస్ రాలేదా? అంటూ కౌంటర్లు వేశాడు. దాంతో పవన్ ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. నాగబాబు కూడా హర్టయ్యారు. ఈ విషయంపై మాట్లాడమని నాగబాబుని అడిగితే `నేను పెంపుడు కుక్కల గురించి తప్ప, ఊర కుక్కల గురించి మాట్లాడను` అంటూ గోగినేనిని పరోక్షంగా ఊరకుక్క అంటూ... చురక అంటించాడు. దాంతో మళ్లీ గోగినేని గొంతేసుకుని పడిపోయాడు. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని చెప్పిన నాగబాబు ఓ మూర్ఖుడని పాత కామెంట్లని గుర్తు చేశాడు. దాంతో మళ్లీ మెగా ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యారు.
సినిమాలూ, వాళ్ల వ్యవహారాలతో గోగినేనికి ఏమాత్రం సంబంధం లేదు. ఎవరైనా తమవైన చర్యలతో... మూఢ నమ్మకాల్ని, హింసనీ ప్రొత్సహిస్తున్నట్టుంటే తప్పకుండా గొంతెత్తాల్సిందే. కానీ... ఇది గోగినేనికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం. ఇలాంటప్పుడు ఇలా మెగా హీరోలపై కక్ష కట్టినట్టు మాట్లాడడమెందుకో. బహుశా ఆయనకూ పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌కి వెళ్లుంటుందన్నది నెటిజన్ల మాట.