ఆమధ్య ప్రాజెక్టులు గట్టిగానే చేతులు మారుతున్నాయి. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా చేతులు మారిపోయింది. త్రివిక్రమ్ మహేష్ తో, ఎన్టీఆర్ కొరటాలతో జట్టు కట్టారు. ఇప్పుడు మరో కథ లోనూ హీరో మారుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఆమధ్య సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని ప్రకటించారు. `లైగర్` తరవాత.. విజయ్ దేవరకొండ సినిమా ఇదే అని ఫిక్సయ్యారు. అయితే.. ఇప్పుడు సుకుమార్ సినిమాలో హీరో మారిపోయినట్టు టక్.
ఈ కథ.. రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. `పుష్ష` అయిపోగానే.. సుకుమార్ - రామ్ చరణ్‌ల కాంబో సెట్ అవ్వబోతోందని టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో `రంగస్థలం` వచ్చిన సంగతి తెలిసిందే. అటు చరణ్ కెరీర్‌లోనూ, ఇటు సుకుమార్ కెరీర్‌లోనూ అదే మైల్ స్టోన్. అప్పటి నుంచీ వీరిద్దరూ మరోసారి కలసి పనిచేయాలని ఉవ్వీళ్లూరుతున్నారు. ఈ కాంబో వీలైనంత త్వరగా పట్టాలెక్కాలన్నది ఇద్దరి ఉద్దేశ్యం. 2022లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందని, విజయ్ దేవరకొండతో చేయాల్సిన కథనే రామ్ చరణ్ కోసం సుకుమార్ షిఫ్ట్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.