ప్రభాస్ సినిమా `రాధే శ్యామ్` విడుదల గురించి.. ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించిన అప్ డేట్స్ ఇవ్వడంలో చిత్రబృందం చాలా అశ్రద్ధ చేస్తోందన్నది ప్రభాస్ అభిమానుల అసంతృప్తి. పైగా `రాధే శ్యామ్` రీషూట్లు జరుపుకుంటోందని, దాని వల్ల సినిమా మరింత ఆలస్యం అవ్వబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై.... రాధేశ్యామ్ టీమ్ స్పందించింది. రీషూట్లలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఓ పాట, కొన్ని యాక్షన్ సన్నివేశాలే బాకీ అని, వాటిని త్వరలోనే తెరకెక్కిస్తామని అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో కృష్ణం రాజు ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనపై కూడా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాల్సివుందట. అవన్నీ పూర్తయితే.. సినిమా అయిపోయినట్టే అని నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు. కాకపోతే... రిలీజ్ డేట్ విషయంలోనే ఇంకా ఓ క్లారిటీ రాలేదు. కోవిడ్ కారణంగా సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ టైమ్ లో రిలీజ్ డేట్ పై ఓ అంచనాకు రావడం నిర్మాతలకు కష్టమే.