మలర్ బ్యూటీగా పాపులర్ అయ్యి, తెలుగులో 'ఫిదా'తో అందరి మనసుల్ని గెలుచుకున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి తాజాగా 'ఎన్జీకే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో ఛాట్ చేస్తానని చెప్పింది. అభిమానులు తమ తమ ప్రశ్నలను పోస్ట్ చేయాలని కోరింది. దాంతో సోషల్ మీడియాలో అభిమానులు పోటెత్తారు. తమ తమ ప్రశ్నలను సంధించారు. అయితే, మాట్లాడతానని మాటిచ్చిన సాయిపల్లవి హ్యాండిచ్చింది.
దాంతో సాయిపల్లవిపై గుస్సా అయిన నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. 'నువ్వు ఛీట్ చేశావ్..' అంటూ ఆమెపై ధూషణలకు దిగారు. కాస్సేపటి తర్వాత స్పందించిన సాయి పల్లవి నెటిజన్స్‌కి సారీ చెప్పింది. మాట్లాడాలనుకున్నాను కానీ, కుదరలేదు, నన్ను క్షమించండి.. అంటూ అభిమానులను కోరింది. దాంతో కాస్త శాంతించిన ఫ్యాన్స్ ఆమె క్షమాపణల్ని స్వీకరించారు. మామూలుగానే సాయిపల్లవి రకుల్, సమంతల మాదిరి సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండదు.
అలాంటిది 'మీతో కొద్దిసేపట్లో ముచ్చటిస్తాను..' అని చెప్పాక కూడా సాయిపల్లవి లైన్లోకి రాకపోవడంతో నెటిజన్స్ కోప్పడడంలో తప్పేం లేదు. అయితే, అసలు సాయిపల్లవి చెప్పిన టైంకి ఆన్‌లైన్‌లోకి రాకపోవడానికి కారణమేంటనేది మాత్రం చెప్పలేదు. కానీ, తర్వాత లైన్లోకి వచ్చిన సాయిపల్లవి ఫ్యాన్స్‌తో కాసేపు చక్కగా ముచ్చటించి బోలెడన్ని ఆశక్తికరమైన విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.