పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. మొన్నేనే భీమ్లా నాయక్ విడుదల చేశారు. హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పై వుంది. భవదీయుడు లైన్ లో వుంది. ఈ గ్యాప్ లో 'వినోదియ సిత్తం' అనే తమిళ రీమేక్ పవన్ కళ్యాణ్ లిస్టు లోకి వచ్చింది. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తూ తనే డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఈ రిమేక్ కు త్రివిక్రమ్ స్క్రిప్టును అందిస్తారని, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తగట్టు ఇందులో పెను మార్పులు చేస్తారనిని వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమా పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా లేరు. కారణం.. ఎన్ని మార్పులు చేసిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపడే సినిమా కాదు ఇది. ఓ ప్రముఖ నిర్మాతకి పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాలి. కేవలం ఇరవై రోజులు కాల్సీట్లతో సినిమా పూర్తి చేసేయాలనే ఆలోచన ఈ రీమేక్ చేస్తున్నారని టాక్. అయితే ఈ రీమేక్ వద్దు బాబోయ్ అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అందోళన చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆందోళనలో న్యాయం వుంది. 'వినోదియ సిత్తం' సినిమా చూసిన వారికి ఇదెలా పవన్ కళ్యాణ్ తో చేస్తారనే సందేహం రాకమానదు. అందుకే ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు తప్పితే ఇంకా క్లియర్ గా ప్రకటన ఇవ్వలేదని తెలుస్తుంది.