ఇప్పుడంతా టీ 20ల కాలం. వన్డే మ్యాచ్ సైతం బోర్ కొట్టేస్తోంది. టెస్ట్ మ్యాచ్ సంగతి సరే సరి. సినిమాలు కూడా అంతే. మూడు గంటల సినిమాలు ఎప్పుడో ఎగిరిపోయాయి. రెండున్నర గంటల రన్ టైమ్అంటేనే.. భయపడిపోతున్నారు. 2 గంటలకు సినిమా కుదించాలన్నది దర్శక నిర్మాతల తపన. రన్ టైమ్ ఎక్కువన సినిమా ఏదీ ఈమధ్య కాలంలో ఆడలేదు కూడా. అయితే.. `ఆచార్య` మాత్రం మూడు గంటల సినిమా అట.
చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `ఆచార్య`. కాజల్ కథానాయిక. రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాని ఈ వేసవిలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. సినిమా కడా ఎప్పుడో పూర్తయింది. ఇటీవల ఫైనల్ కట్ అయిపోయిందట. సినిమా నిడివి చూస్తే మూడు గంటలు వచ్చిందని టాక్. దాంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. ఈ నిడివి... సినిమా రిజల్ట్ పై ప్రభావాన్ని చూపిస్తుందేమో అనే భయం పట్టుకుంది. అయితే.. సినిమా విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉంది. ఈలోగా రన్ టైమ్ ఎంత ఉండాలన్న విషయంలో చిరు ఓ నిర్ణయం తీసుకుంటారు. స్వతహాగా కొరటాల శివ సినిమాలు లెంగ్తీ గానే ఉంటాయి. అయినా సరే, ఆయన హిట్లు కొట్టారు. కాబట్టి.. ఈ సినిమాపై కూడా అలాంటి భరోసా ఉంచుకోవచ్చన్నది ఇన్ సైడ్ వర్గాల మాట.