బాలీవుడ్ బాట పట్టిన తమన్...

By iQlikMovies - March 31, 2018 - 14:21 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు, తమిళ్ లో మంచి మంచి హిట్ సాంగ్స్ ఇస్తూ దూసుకుపోతున్న తమన్ ఇప్పుడు బాలీవుడ్ బాట పటినట్టుగా కనిపిస్తున్నది. 

ఈ మధ్యనే గోల్మాల్ 5 అనే హిందీ చిత్రానికి స్వారాలు అందించిన తమన్ ఇప్పుడు మరో హిందీ చిత్రానికి సంగీతం అందివనున్నాడు. అయితే ఈ హిందీ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన టెంపర్ చిత్రానికి రిమేక్ అయిన సింబా కావడం విశేషం. ఈ విషయాన్నీ స్వయంగా తమన్ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో గా రన్వీర్ సింగ్, హీరోయిన్ గా సారా అలీ ఖాన్ నటిస్తుండగా కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీనితో ఈ సినిమా తమన్ కి హిందీలో ఒక మంచి బ్రేక్ ఇచ్చే చిత్రంగా మిగిలిపోనుంది అని కచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాతో తమన్ మార్క్ మంచి మాస్ బీట్స్ బాలీవుడ్ కి పరిచయం కానున్నాయి.

ఇక ఈ చిరం ఈ ఏడాది డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS