తెలుగులో హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. అందంగా ఉండే అమ్మాయిలకు నటన రావడం లేదు. నటన చేతనైన అమ్మాయిలు గ్లామర్ గా ఉండడం లేదు. ఇవి రెండూ ఉంటే హిట్లు దొరకడం లేదు. అలా ఏదో ఓ లోటు. అన్నీ ఉన్న అమ్మాయిలకు మంచి గిరాకీ. తాజాగా... `జాతి రత్నాలు`తో.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో చక్కగా సరిపోయింది.
చూడ్డానికి బొద్దుగా ఉన్నా, ముద్దొస్తోంది. పైగా ఆ సినిమా హిట్టు. అందుకే ఫరియా కి అవకాశాలు వరుసకడుతున్నాయి. తాజాగా రవితేజ సరసన.. ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని టాక్. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులోనే ఫరియా హీరోయిన్ గా నటించే ఛాన్సుంది. ఆ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని సమాచారం. మరోవైపు స్వప్న సినిమాలోనే.. ఓ సినిమా చేయడానికి ఫరియా సంతకాలు చేసేసిందట. ఇవి కాక మరో రెండు ఆఫర్లు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది.