రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. `భారతీయుడు 2` తరవాతే ఈ సినిమా పట్టాలెక్కాలి. అయితే కొన్ని కారణాల వల్ల `భారతీయుడు 2` షూటింగ్ ఆగింది. దాంతో చరణ్ సినిమాపై ఫోకస్ చేసే ఛాన్స్ శంకర్‌కి దక్కింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచక సాగుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే సంగీత దర్శకుడిగా తమన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కథానాయిక అన్వేషణ కూడా మొదలెట్టేసినట్టు టాక్. ఇందులో హీరోయిన్ గా రష్మికని ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కైరా అడ్వాణీ పేరు కూడా పరిశీలనలో ఉందట. చరణ్ - కైరా.. జంటని `వినయ విధేయ రామా`లో చూసేశారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సెంటిమెంట్ బలంగా పనిచేస్తే... కైరా ఈ సినిమాలో ఉండదు. రష్మికకే ఛాన్సు ఎక్కువగా ఉంది. మరి.. శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.