ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్ 'దంగల్' సినిమా ద్వారా అందరికీ సుపరిచితురాలే. ఆ సినిమాలో కుస్తీ పోటీలతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత అమ్మడికి అవకాశాలు జోరందుకున్నాయి. సినిమా అంటే గ్లామర్ కదా. సో గ్లామర్‌లో కొంచెం డోస్ పెంచింది ఈ ముద్దుగుమ్మ. హాట్ హాట్ గెటప్స్‌తో కవ్విస్తోంది.
బికినీలో హాట్ హాట్ పోజులిచ్చి సోషల్ మీడియాని హీటక్కించేసింది. అయితే అమ్మడు ముస్లిం కదా. ముస్లిం స్త్రీలకు కొన్ని కట్టుబాట్లుంటాయి. దాంతో ఆ కట్టుబాట్ల పేరు చెప్పి ఈ ముద్దుగుమ్మకి కొందరు ముశ్లిం పెద్దల నుండి ఫత్వా జారీ చేశారు. అయితే ఈ ముద్దుగుమ్మ అవేమీ పట్టించుకోలేదు. ఫత్వాలు జారీ చేసిన తర్వాత కూడా గ్లామర్ ప్రదర్శన ఆపలేదు ఈ బ్యూటీ. మొదట్లో బికినీలో పోజిచ్చింది. తర్వాత ఇదిగో ఈ తాజా ఫోటోని రిలీజ్ చేసింది.
ఈ ఫోటోలో అమ్మడు మరింత హాట్‌గా కనిపిస్తోంది. కట్టింది శారీనే. కానీ హాట్ అప్పీల్ మాత్రం ఆకాశాన్నందుకుంటోంది. దాంతో ఈ ముద్దుగుమ్మకి మళ్లీ ఫత్వాలు అందుకోక తప్పలేదు. అయినా కానీ సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. ఆ గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే అందాల ప్రదర్శన తప్పనిసరి. అవకాశాల కోసం ఇలాంటి ప్రదర్శనలు షరా మామూలే. అందుకే ఇలాంటి ఫత్వాలేమీ తాను పట్టించుకోనంటోంది ఈ బ్యూటీ. అయినా ఇది తమ ప్రొఫిషన్‌లో భాగం మాత్రమే ఇది రీల్ లైఫే కానీ రియల్ లైఫ్ కాదంటోందీ బ్యూటీ.
ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటోన్న ఈ బ్యూటీకి ఈ టైంలో ఇవేం కష్టాలో కానీ, ఇలాంటివి ఒక్కోసారి కలిసొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమో చూడాలి ఈ బ్యూటీ కష్టాల నుండి బయట పడి, హీరోయిన్గా తన స్థానాన్ని ఎలా పదిల పరచుకుంటుందో!