'దంగల్' సినిమాతో పరిచయమైన బ్యూటీ ఫాతిమా సనా షేక్. ఆ సినిమాలో అమీర్‌ఖాన్‌కి కూతురుగా కుస్తీ పోటీల్లో ఇరగదీసిన ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్గా సత్తా చాటుతోంది. తొలి సినిమాలో గ్లామర్‌కి అవకాశం లేకపోయినా కానీ, తర్వాత నుండి గ్లామర్‌లో రెచ్చిపోతోంది. సినిమాల సంగతి అలా ఉంచితే, సోషల్ మీడియాలో అమ్మడి గ్లామర్‌కి హద్దే ఉండట్లేదు. అందుకే ఈ ముద్దుగుమ్మకి ముశ్లిం పెద్దల నుండి ఫత్వాల్ కూడా జారీ అవుతున్నాయి. అయినా కానీ ఏ మాత్రం లెక్క చేయకుండా, గ్లామర్‌ని కంటిన్యూ చేస్తోంది. సినీ రంగం అంటేనే గ్లామర్‌కి కేరాఫ్ అడ్రస్. అది లేకపోతే ఇక్కడ అవకాశాలుండవ్. ఇది ప్రొఫిషన్‌లో ఓ భాగం మాత్రమే.. అంటోంది ఈ హాట్ బ్యూటీ. ప్రొఫిషన్‌లో ఎదగడానికి అవసరమైన గ్లామర్ షో చేసి తీరాల్సిందేనని ఖచ్చితంగా చెబుతోంది. ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలో ఫాతిమా కలర్ ఫుల్ శారీలో ఎంత బ్రైట్‌గా మెరిసిపోతోందో చూశారుగా. శారీ అయితేనేం గ్లామర్‌కి ఏమాత్రం తీసిపోవట్లేదుగా!