శేఖర్ కమ్ముల ఫిదా చిత్రం ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా మారిపోయింది.
విడుదల అయి రెండు వారాలు దాటుతున్న కలెక్షన్స్ మాత్రం అసలు తగ్గట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫిదా చిత్రం సుమారు రూ 60 కోట్ల గ్రాసు అలాగే రూ 34 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇక అమెరికాలో ఈ చిత్రం అందరిని ఫిదా చేసేస్తుంది, ఇప్పటికి రూ 11 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపు తెలుగు చిత్రాల ఓవర్సీస్ కలెక్షన్స్ లో టాప్ 3లో నిలిచింది.
ఈ వారం విడుదలైన చిత్రాలకి బ్యాడ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ కూడా ఫిదా కి కలెక్షన్స్ పంట పండనుంది.