అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాధం చిత్రం ప్రదర్శిస్తున్న ధియేటర్ లో మొన్న రాత్రి జరిగిన ఓ ఘటన కత్తిపోట్ల వరకు వెళ్లేలా దారితీసింది.
అందుతున్న వివరాల ప్రకారం, నంద్యాల పట్టణంలోని ఒక ధియేటర్ లో దువ్వాడ జగన్నాధం చిత్రం ప్రదర్శన జరుగుతుండగా కొంతమంది ప్రేక్షకులు తెరమీదకి కాగితాలు చల్లుతుండగా ధియేటర్ సిబ్బంది వారిని వారించారు.
దీనితో కాగితాలు చల్లుతున్న వారికి, ధియేటర్ సిబ్బందికి మధ్య మాట మాట పెరిగి ధియేటర్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు గొడవ చేస్తున్న వారి పై కత్తులతో దాడి చేసి వారిని గాయపరిచారు.
ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన తీరు పై విచారణ చేపట్టారు.