రానా దగ్గుబాటి తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సంచలనం అనే చెప్పాలి. చాలా కాలం తరువాత దర్శకుడు తేజ నుండి మంచి హైప్ తో వస్తున్న చిత్రం కావడం అలాగే ట్రైలర్ లో రానా పలికించిన అభినయం ఈ చిత్రం పై ఆడియన్స్ కి ఆసక్తిని పెంచేలా చేశాయి.
ఇక ఈ చిత్ర బిజినెస్ విషయానికి వస్తే, సుమారు రూ 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్ర తెలుగు, తమిళ, హిందీ రైట్స్ రూ 16కోట్లకు అమ్ముడవగా ఇంకొక రూ 4కోట్లకు ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది.
దీనితో ఈ సినిమా బిజినెస్ పరంగా సేఫ్ అయినట్టు సమాచారం. ఇక ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.