బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలపైనే ఇప్పుడు అందరి ద్రుష్టి వున్నాయి. రెండు సినిమాల పై భారీ అంచనాలు వున్నాయి. రెండు సినిమాలని నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ. ప్పటి వరకూ ప్రమోషన్స్ కార్యక్రమాలని చాలా ఫ్రండ్లీగా చేశారు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఎక్కడా తగ్గకుంటా అన్ని ప్రచారకార్యక్రమాలు జరిపారు. రెండు సినిమాలు చూడటాడానికి ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇద్దరు హీరోలు, ఇరు అభిమానులు ఇంత పాజిటివ్ గా వుండటం ఓ రాజకీయ పార్టీకి రుచించడం లేదు. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టడానికి ఆ రాజకీయ పార్టీ పన్నాగం పన్నుతోందని సమాచారం.
ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ఇద్దరు హీరోలను తిడుతూ పోస్టులు, ట్రొల్ వీడియోలు, వ్యక్తిగత అంశాలు ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టేందుకు సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది. సినిమాలు రిలీజ్ అయిన వెంటనే అట్టర్ ప్లాప్ అంటూ నెగిటివ్ ప్రచారం చేయడం, అలాగే ఇద్దరు హీరోల సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా సినిమా బ్యానర్లు చించడం, థియేటర్ల లో దాడులు చెయ్యడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు కుట్ర చేశారాని తెలుస్తోంది. ఈ సమాచారం ఇరువురి హీరోల దృష్టికి వెళ్లడంతో అభిమానులు ఆవేశపడి సదరు పార్టీ ట్రాప్ లో పడకుండా జాగ్రతగా వుండాలని అభిమాన సంఘాల ద్వార దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.