వితిక అలకకు పునర్నవి కారణమా?

మరిన్ని వార్తలు

భర్త ఎప్పుడూ భార్యనే సపోర్ట్‌ చేయాలి. తప్పయినా, ఒప్పయినా, మంచైనా, చెడైనా. కానీ, బిగ్‌ హౌస్‌లో తాజాగా ఓ విచిత్రం చోటు చేసుకుంది. బిగ్‌బాస్‌ హిస్టరీలోనే తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన భార్యా భర్తలు వరుణ్‌ - వితిక ఆడియన్స్‌ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న వీరిద్దరి కారణంగా తప్పు లేకున్నా, మహేష్‌ బలైపోయాడు. తాజాగా పునర్నవి చేదు అనుభవం చవి చూడాల్సి వచ్చింది.

 

తాజా టాస్క్‌లో భాగంగా, వితిక - పునర్నవి మధ్య క్యాజువల్‌గా స్టార్ట్‌ అయిన ఇష్యూ పెద్దదైంది. ఈ ఇష్యూలో వరుణ్‌, వితికా సైడ్‌ కాకుండా, పునర్నవి సైడ్‌ స్టాండ్‌ తీసకోవడంతో, వితికలో జెలస్‌ మొదలైంది. దాంతో వరుణ్‌ని తప్పు పడుతూ, హౌస్‌లో చాలా యాగీ చేసింది. ఆడ్డగోలుగా తాను వాదించి, పునర్నవి టార్గెట్‌ అయ్యేలా ఇష్యూని డైవర్ట్‌ చేసింది. వరుణ్‌ని డామినేట్‌ చేస్తూ, ఆయనపై అలక బూనింది.

 

ఏడ్చేసింది కూడా. ఆమెని వారించడం హౌస్‌ మేట్స్‌కి కత్తి మీద సాముగా మారింది. ఎందుకొచ్చిందిలే అనుకున్నారో ఏమో, భార్యా భర్తలిద్దర్నీ వదిలిపెట్టి, హౌస్‌ మేట్స్‌ పక్కకు జరిగారు. దాంతో చిట్ట చివరికి ఈ ఇష్యూ చల్లారింది. కానీ, ఇన్నాళ్లూ పునర్నవితో ఎంతో ఫ్రెండ్లీగా మసలిన వితిక, ఆమెకు తన ఇన్నర్‌ యాంగిల్‌ని చూపించింది. నేను నీకు ఫ్రెండ్‌ కదా.. అని పునర్నవి అంటే, నో అని విదిల్చేసింది. దాంతో వితిక నిజస్వరూపమేంటో, పునర్నవికి అర్ధమైంది. మొన్న మహేష్‌, ఇప్పుడు పునర్నవి.. ఇకపై వితిక విషయంలో మిగిలిన హౌస్‌ మేట్స్‌ కూడా ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS