'హేమా అప్పుడు బిగ్‌బాస్‌గాడు పెద్ద తోపు అన్నారు.. పాపం శ్వేతారెడ్డి గారిని తిట్టారు. ఇప్పుడు మీరేమో, బిగ్‌బాస్‌గాడిని ఛీటర్ అంటున్నారు.. ఎందుకు? అని సూటిగా ప్రశ్నిస్తోంది శ్రీరెడ్డి. ఏ పనీ లేకపోతే, ఎవరో ఒకర్ని ఊరికే కెలికి తన దురద తీర్చుకోవడం శ్రీరెడ్డికి అలవాటే. అక్కడికి తానేదో పేద్ద సెన్సేషన్ అయినట్లు. ఎంత వాగినా ఆమెని ఎవ్వరూ పట్టించుకోరు. కనీసం రిప్లై కూడా ఇవ్వరనే విషయం ఆమెకీ తెలుసు. కానీ, శ్రీరెడ్డి తన తీరు మాత్రం మార్చుకోదంతే. తాజాగా బిగ్‌బాస్ షో ట్రెండింగ్ ఇష్యూ ఉన్న సంగతి తెలిసిందే.
ఆ ఇష్యూని తన పబ్లిసిటీ కోసం యూజ్ చేసుకోవాలనుకుంది శ్రీరెడ్డి. ఆ క్రమంలో ఫస్ట్ ఎలిమినేషన్‌లో భాగంగా బిగ్‌హౌస్ నుండి బయటికి వచ్చేసిన హేమని పట్టుకుంది. హౌస్‌లోకి వెళ్లక ముందు బిగ్‌బాస్ మంచోడన్నావ్.. బయటికొచ్చాక విమర్శిస్తున్నావ్.. అంటూ హేమని సూటిగా ప్రశ్నించింది శ్రీరెడ్డి. అయితే, హేమ రెస్పాండ్ అవుతుందా? ఏమో తెలీదు కానీ, బిగ్‌బాస్ హౌస్ నుండి బయటికొచ్చాక హేమ అదే స్టేజ్‌పై హౌస్ మేట్స్ అంతా చాలా మంచోళ్లు. ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు. అందరూ నా పిల్లలే.. అంటూ తన పెద్దరికాన్ని చాటుకుంది.
హౌస్‌లో ఉన్నప్పుడు, కిచెన్ రెస్పాన్సిబులిటీ తీసుకున్న హేమ, హౌస్ మేట్స్ వద్ద మంచి అభిప్రాయం దక్కించుకోలేకపోయింది. దాంతో ఆమె అందర్నీ డామినేట్ చేస్తోందనే అభిప్రాయానికి వచ్చేశారు హౌస్‌మేట్స్. 'హేమక్క తోపు..' అంటూనే ఆమెని హౌస్ నుండి బయటికి తోసేశారు. ఆమె ప్లేస్‌లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని బిగ్‌బాస్ టీమ్ వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపించిన సంగతి తెలిసిందే.