సుహాస్ దశ తిరిగినట్టే

మరిన్ని వార్తలు

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి హీరోయిన్గా అన్ని భాషల్లో తన హావా చాటుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ, ఒక వైపు  కమర్షియల్ సినిమాలు, ఇంకో వైపు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ కెరియర్ లో బిజీ బిజీగా ఉంది. వరుణ్ ధావన్ తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమైంది. అన్ని భాషల్లోనూ అందరి సూపర్ స్టార్స్ తో జోడి కడుతున్న కీర్తి ఇప్పుడు టాలీవుడ్ కమెడియన్ హీరో సుహాస్ సరసన నటించడానికి రెడీ అవ్వడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. 


సుహాస్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాడు. మొదట షార్ట్ ఫిలింస్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ తరవాత తెలుగు సినిమాల్లో కమెడియన్ గా పరిచయం అయ్యాడు. 'కలర్ ఫోటో'  సినిమాతో మొదటిసారిగా హీరోగా చేశాడు. కోవిడ్ టైమ్ లో ఈ మూవీ OTT లో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. తన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీకి నేషనల్ అవార్డు రావటం తో సుహాస్ కి అవకాశాలు పెరిగాయి. విభిన్న కథలతో హీరోగా నిలదోక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి వినూత్న సినిమాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇదే ఊపుతో ఇప్పుడొక కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చేశాడు అదీ కీర్తి సురేష్ తో కలిసి నటించటానికి సిద్ద మయ్యాడు. 


ఐవి శశి దర్శకత్వంలో కీర్తి సురేష్ - సుహాస్ కలిసి 'ఉప్పు కప్పురంబు' అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ నేరుగా OTT లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు నిర్మిస్తున్న ఈ సినిమాకి వసంత్ మురళీకృష్ణ కథ అందిస్తున్నారు. ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రకటించి, టైటిల్ లాంచ్ చేసారు. ఇది ఒక సెటైరికల్ కామెడీ జోనర్ అని సమాచారం.  ఒక గ్రామంలోని స్మశానవాటికలో ఖాళీ స్థలం లేకపోవడంతో అక్కడి ప్రజలు ఎదుర్కొన్నసంక్షోభాన్ని, ఆ పరిస్థితిని అధిగమించడానికి కనుగొన్న పరిష్కార మార్గాలే కథ అని కీర్తిది పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర అని అందుకే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. కీర్తి సురేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటంతో సుహాస్ ఇమేజ్ పెరిగినట్టే, ఈ సినిమాలో వీరు జంటగా నటిస్తారా? లేదా కీలక పాత్రలా అన్నది తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS