రొమాంటిక్ సెట్లో అగ్ని ప్ర‌మాదం.

By Gowthami - October 15, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

పూరి జ‌గన్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `రొమాంటిక్‌`. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. హీరో, హీరోయిన్ల‌పై ఓ గీతాన్ని తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు సెట్లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. సెట్లో ఉన్న తెర‌లు అంటుకోవ‌డంతో... ఆ మంట‌కు వ‌స్తువులు కాలి బూడిద అయ్యాయి. ఎవ‌రికీ ఎలాంటి గాయాలూ అవ్వ‌లేదు. అగ్ని ప్ర‌మాద దృశ్యం వీడియోల‌లోనూ రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది. బాల న‌టుడిగా రంగ ప్ర‌వేశం చేసిన పూరి ఆకాష్‌.. మెహ‌బూబాతో హీరో అయ్యాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. రొమాంటిక్‌పై మాత్రం ఆశ‌లు, అంచ‌నాలూ బాగానే ఉన్నాయి. మ‌రి ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS