బిగ్‌ తంటా: ఉడుం పట్టు పట్టింది మొదటికే మోసం తెచ్చింది!

మరిన్ని వార్తలు

హౌస్‌లో ఇంతవరకూ చాలా తక్కువ సార్లు నామినేట్‌ అయ్యింది శివజ్యోతి. ఎలాగో లక్కు కలిసొచ్చి, ఎలిమినేషన్‌ గండం నుండి గట్టెక్కి ఇన్ని రోజులు హౌస్‌లో ఉండగలిగింది. ఒక్కసారి నామినేట్‌ అయిన అలీ రెజా, ఎలిమినేట్‌ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ భయంతోనే తాను నామినేట్‌ కాకూడదనుకున్నాడు. రాహుల్‌ని రిక్వెస్ట్‌ చేసి, తన స్థానాన్ని దక్కించుకున్నాడు. అదే భయం శివజ్యోతిలోనూ లేకపోలేదు. ఎలాగోలా ఇన్ని రోజులూ గట్టెక్కింది కానీ, ఇక తన వల్ల కాదని అర్ధమైపోయింది. అందుకే ఎలాగోలా నామినేషన్‌ని తప్పించుకోవాలనుకుంది.

 

అయితే, తానొకటి తలిస్తే, బిగ్‌బాస్‌ ఇంకోటి తలిచినట్లయ్యింది పాపం శివజ్యోతికి. స్థానం దక్కించుకోవాలనే క్రమంలో అతి ఓవరాక్షన్‌ చేసి, అనవసరంగా ఇన్ని రోజులూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన తన మంచితనం ముసుగు తీసేయాల్సి వచ్చింది. ఉన్నవీ, లేనివీ కల్పించి వరుణ్‌, వితికలపై విరుచుకుపడింది. ఈ సారి నామినేట్‌ అయితే, ఖచ్చితంగా తాను ఎలిమినేట్‌ అయిపోవడం ఖాయమనే ఉద్దేశ్యంతోనే ఉడుం పట్టు పట్టింది కానీ, నెగ్గలేకపోయింది.

 

తనకి దక్కనిది, ఇంకెవ్వరికీ దక్కకూడదనుకుందో ఏమో, హౌస్‌ మొత్తం నామినేట్‌ కావడానికి శివజ్యోతి ప్రత్యక్ష కారణమైంది. సరే, నామినేషన్స్‌ ప్రక్రియ జరిగిపోయింది. మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి సంబంధించి, ప్రీ ఫైనల్‌ వారమైన ఈ వారం హౌస్‌నుండి బయటికి వెళ్లేందుకు శివజ్యోతి, అలీ రెజాకే ఎడ్జ్‌ ఉందని ఆడియన్స్‌ ఓ అంచనాకి వచ్చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS