'మార్నింగ్ షోస్ టికెట్స్ ఫ్రీ' అనే ఆఫర్ ఇచ్చి సరికొత్తగా తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు ఓ కుర్రహీరో. 'బీచ్ రోడ్డులో చేతన్' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు చేతన్ మద్దినేని. ఈ సినిమాని స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు. ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి. ఈ శుక్రవారం ధియేటర్స్‌లో సందడి చేయనున్న ఈ సినిమాకి స్పెషల్ ప్రమోషన్ ఆ రోజు విడుదల కాబోయే ధియేటర్స్ అన్నింటా మార్నింగ్ షో టికెట్స్ ఫ్రీగా ఇవ్వబడును.. అని రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని కనబరుస్తోంది.
డబ్బులు పెట్టి చూడడం ఇష్టం లేని వారు, సినిమా పిచ్చ ఉన్నవాళ్లు ఖచ్చితంగా సినిమాని చూస్తారు. నష్టం వచ్చినా, సినిమాలోని కంటెంట్ జనం మాట్లాడుకునేలా చేయాలనే ఉద్దేశ్యంతోనే హీరో కమ్ దర్శకుడు చేతన్ మద్దినేని ఇలా ప్లాన్ చేశాడట. ఐడియా బాగుంది. కానీ వర్కవుట్ అవుతుందో.? లేదో చూడాలి మరి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఇదొక స్క్రీన్‌ప్లే బేస్డ్ రియలిస్టిక్ రా యాక్షన్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య తెగ వర్కవుట్ అవుతున్నాయి. స్టార్ వేల్యూతో సంబంధం లేకుండానే, టాక్ బాగుంటే చాలు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే, అదే రోజు విడుదల కానున్న 'జార్జి రెడ్డి', 'రాగల 24 గంటల్లో' సినిమాల పైనా అంచనాలున్నాయి. సో వీటిని దాటి, మన 'బీచ్ రోడ్లో చేతన్' ఫ్రీ ఐడియా ఎంత మేర వర్కవుట్ అవుతుందో చూడాలిక.