ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలై, దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయిపోయినా ఇప్పటి వరకూ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ ఎవరన్నది తేలలేదు. ఆ స్థానంలో ఒలివియా మారిస్ అనే హాలీవుడ్ నటి వచ్చి చేరింది. ఆమె పేరు వినడం, రూపం చూడడం తెలుగు ప్రేక్షకులకైతే ఇదే తొలిసారి. అయినా సరే... రెస్సాన్స్ మాత్రం అదిరిపోయింది. చిత్రబృందం ఒలివియా పేరు ప్రకటించిందో లేదో.. ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆత్రుత సినీ ప్రేమికులకు ఎక్కువైపోయింది. అందుకే గూగూల్లో అత్యధికులు సెర్చ్ చేసిన పేరు ఆమెదే అయ్యింది.
నిన్న సోషల్ మీడియాలో హవా అంతా ఒలివియాదే. టాలీవుడ్లో తన ఎంట్రీకి వస్తున్న స్పందన చూసి ఒలివియా కూడా ఆశ్చర్యపోతోంది. ఆనందిస్తోంది. ఒలివియాతో పాటు ఇద్దరు విలన్ల పేర్లు కూడా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాళ్లెవరో తెలుసుకోవాలన్న ఆసక్తిని కూడా సినీ ప్రేమికులు బాగానే కనబరిచారు. మొత్తానికి... ఈ ముగ్గురికీ ఆర్.ఆర్.ఆర్ వల్ల కొత్త క్రేజ్ వచ్చినట్టైంది.