గ‌ద్ద‌ల‌కొండ‌... ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్లు ఇవే.

By iQlikMovies - September 27, 2019 - 12:29 PM IST

మరిన్ని వార్తలు

వ‌రుణ్‌తేజ్ ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు. `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`గా మాస్‌ని అల‌రించ‌డ‌మే కాకుండా, బాక్సాఫీసుని షేక్ చేశాడు. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ అందుకుంది. ఇప్పుడు సూప‌ర్ హిట్ దిశ‌గా ప‌రుగులు పెడుతోంది. తొలి వారంలో దాదాపు 20 కోట్ల వ‌సూళ్లు సాధించింది. ఈ వారం కొత్త సినిమాలేమీ లేవు. సో.. గ‌ద్ద‌ల‌కొండ‌కు ఇది ప్ల‌స్ పాయింటే. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది.

 

ఓవ‌ర్సీస్‌లో మాత్రం స్వ‌ల్ప న‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. నైజాంలో ఈ చిత్రానికి 6.15 కోట్లు వ‌చ్చాయి. సీడెడ్‌లో 2.8 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో 2.10 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో 2.10 కోట్లు ద‌క్కాయి. రెస్టాఫ్ ఇండియాలో 1.10 కోట్లు వ‌చ్చాయి. సోమ‌వారం వ‌సూళ్లు బాగానేఉన్నా, మంగ‌ళ వారం నుంచి బాగా డ్రాప్ అయ్యాయి. ఈ వీకెండ్ మ‌ళ్లీ గ‌ద్ద‌ల‌కొండ పుంజుకోవ‌చ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS