ఇస్మార్ట్ లాభాల్లో కొంత‌.. ఆ ద‌ర్శ‌కుల కోసం.

మరిన్ని వార్తలు

ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఈ చిత్రానికి పూరినే నిర్మాత‌. అందుకే ఇప్పుడు ఆ సినిమా లాభాల్లో కొంత‌... సామాజిక సేవ కోసం కేటాయించబోతున్నాడు. చిత్ర‌సీమకు సేవ చేసి, ఇప్పుడు సినిమాల్లేక‌, ఆర్థికంగా చితికిపోయిన ద‌ర్శ‌కుల‌కు, స‌హాయ ద‌ర్శ‌కుల‌కు పూరి స‌హాయం అందించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే అలాంటి ఓ 20మందిని పూరి గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. 'ఇది పెద్ద స‌హాయం కాదు.. చిరున‌వ్వుతో ప‌ల‌క‌రింపు మాత్ర‌మే.

 

ద‌య ఉంచి ఈ స‌హాయాన్ని స్వీక‌రించండి' అంటూ పూరి ఓ లేఖ కూడా రాశాడు. `` దర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసి ఇబ్బందుల్లో ఉన్న చాలామందిని గ‌మ‌నించాం. వాళ్లు బాగుండాల‌ని దేవుణ్ణి కోరుకోవ‌డం కంటే, మాకు చేత‌నైన స‌హాయం చేయాల‌నిపించింది`` అంటూ... పూరి ఈ చ‌క్క‌టి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. వ‌చ్చిన లాభాల్ని జేబులోనే వేసుకోకుండా ప‌క్క‌వాళ్ల క‌డుపు నింప‌డానికి ప్ర‌య‌త్నించ‌డం నిజంగా అభినందించ‌ద‌గిన విష‌యం. ఈ విష‌యంలో పూరికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Image


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS