మాస్ సినిమా పవరేంటో మరోసారి తెలిపిన సినిమా `గద్దలకొండ గణేష్`. తమిళంలో ఘన విజయం సాధించిన `జిగడ్తాండ`కి ఇది రీమేక్. తమిళంలో మహా మాసీగా సాగిన ఈ సినిమాని తెలుగులో హరీష్ శంకర్ తనదైన స్టైల్లో తీర్చిదిద్దాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. బాక్సాఫీసు దగ్గర హిట్గా డిక్లేర్ చేసేసింది ట్రేడ్ మార్కెట్. వసూళ్లూ అదే స్థాయిలో వస్తున్నాయి.
తొలి నాలుగు రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్లు సాధించింది. వీకెండ్లో ఉన్న దమ్ము.. వీక్ డేస్లో కనిపించదు. కానీ.. గద్దలకొండ మాత్రం సోమవారం కూడా నిలకడైన వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 23 కోట్ల వ్యాపారం జరిగింది. తొలి నాలుగు రోజుల్లోనే 60 శాతం వసూలు చేయగలిగింది. ఈ వారాంతంలోనూ గద్దలకొండనే హవా చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రానికి 5.2 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్లో 1.5 కోట్లు దక్కాయి.