గజల్ శ్రీనివాస్ పైన లైంగిక ఆరోపణలు రావడం ఆయనని పోలీసులు అరెస్ట్ చెయ్యడం ఆ తరువాత కోర్టు ఆయనకీ జనవరి 12వ తేదీ వరకు రీమాండ్ విదించటం జరిగింది.
అసలు ఆయన పైన ఇటువంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఆయన గురించి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు షాక్ కి గురయ్యారు. ఇవ్వన్ని పక్కకి పెడితే గజల్ శ్రీనివాస్ సేవ్ టెంపుల్ అనే స్వచ్చంద సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనతో వెంటనే సేవ్ టెంపుల్ స్వచ్చంద సంస్థ వారు అప్రమత్తమయ్యారు.
కమిటీ సభ్యులంతా ఈ అంశం పైన ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ సంస్థ అధ్యక్షుడు అయిన వెలగపూడి ప్రకాశరావు మాట్లాడుతూ- సేవ్ టెంపుల్ అంబాసిడర్ అయిన గజల్ శ్రీనివాస్ ని ఆ పదవి నుండి తప్పిస్తున్నట్టుగా తెలిపారు.
ఎంతో బాధ్యత కలిగిన తమ సంస్థకి ఇటువంటి వ్యక్తి వల్ల తప్పుడు అబిప్రాయం ఏర్పడుతుంది అన్న ఉద్దేశ్యంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.