సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ రంగప్రవేశం గురించిన ప్రకటించిన మరుక్షణం నుండి ఆయనకీ మద్దతుగా తమిళనాడులో చాలా మంది రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడుతున్నారు.
అలా వస్తాము అన్న వారిలో సినీ యాక్టర్లతో పాటుగా సామాన్య ప్రజానీకం కూడా ఉన్నారు. అయితే రాజు మహాలింగం అనే వ్యక్తి అయితే అందరికన్నా ఒక అడుగు ముందుకి వేసి తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఆయనతో పాటుగా రాజకీయాల్లోకి వస్తున్నాడు.
ఈయన రజిని నటినించిన రోబో 2 చిత్ర నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ లో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నాడు.
ఈ సినిమా నిర్మించే క్రమంలో గత మూడేళ్ళుగా రజినీకాంత్ తో పరిచయం ఉండడం, ఆయనని దగ్గరినుండి గమనించడం వల్ల ఆయన ఎటువంటి మనిషి అన్న అవగాహన ఉండటం తోనే తాను ఇలా రాజీనామా చేశాను అని తెలిపాడు. ఇక రజినీకాంత్ తో పాటే తన జీవితం కొనసాగనుంది అని ప్రకటించేశాడు. దీన్నిబట్టి చూస్తే అర్దమవుతుందిగా రజిని ఫాలోయింగ్ ఎలా ఉందో..