సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రాలకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫాలోయింగ్ ఉంటుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఆయనకి సినిమాలకి భారతదేశం దాటి కూడా ప్రేక్షకుల సంఖ్య చాలా ఎక్కువ.
అలాంటిది ఆయన కొత్త చిత్రం రోబో 2కి ఈ ప్రేక్షకుల సంఖ్య పెరగనుంది. దీనికి కారణం చాలా కాలం తరువాత సౌదీఅరేబియాలో ధియేటర్ ని సినిమాల ప్రదర్శన కోసం పునఃప్రారంభించనున్నారట. అయితే అలా మొదలుపెట్టక ప్రదర్శితమయ్యే మొదటి సినిమాగా రోబో 2 చరిత్ర సృష్టించనుందట.
ఇప్పటికే దీనికి సంబంధించి సౌదీఅరేబియాలో రజినీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. తమ అభిమాన హీరో సినిమాని ఇలా తమ దేశంలోనే చూడనుండడంతో వారి ఆనందానికి అడ్డులేకుండా పోయింది.
మరి ఈ రోబో2 సౌదీఅరేబియాలో ఎంత వసూలు చేయనుందో చూడాలి.