ఓటీటీలు వచ్చాక... కొత్త సినిమాలు యమ స్పీడుగా వస్తున్నాయి. విడుదలైన పదిహేను రోజులకే.. కొత్త సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. హిట్, ఫ్లాప్ అనే మాట లేదు. అన్నీ... ఇంతే స్పీడు. అయితే.. ఇప్పుడు ఓ సినిమా వారానికే ఓటీటీ లో ప్రత్యక్షమైపోతోంది. అదే..`గాలి సంపత్`.
శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. దర్శకుడు... అనిల్ రావిపూడి నిర్మాతగా వ్యవహరించాడు. విడుదలకు ముందు మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈనెల 11న విడుదలైంది. తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. `జాతిరత్నాలు` జోరుకు తట్టుకోలేక, థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. అందుకే ఓటీటీలో విడుదల చేసేస్తున్నారు. ఈనెల 19 నుంచి.. ఆహాలో ఈసినిమాని చూడొచ్చు. థియేటర్లలో జనాలు ఎలాగూ రాలేదు. కనీసం ఓటీటీలో అయినా చూస్తారేమో..? ఎంత ఫ్లాప్ అయినా, విడుదలైన వారానికే ఓటీటీలో రావడం దారుణమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాకపోతే.. నిర్మాతలకు అంతకంటే మరో మార్గం లేకుండా పోయింది.