మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150' కోసం జనం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే మరో మాట. మామూలుగానే మొబైల్ గేమ్స్ అంటే పడి చచ్చిపోతున్నారు ప్రస్తుతం. ఇంతకు ముందు గేమ్స్ అంటే పిల్లలే ఇష్టపడేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. పిల్లా పెద్దా తేడా లేకుండా వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. అందుకే 'ఖైదీ'టీం సరికొత్తగా ఆలోచించింది. అదేంటంటే ''బాస్ ఇన్ గేమ్ మెగా 150'' పేరుతో ఓ గేమ్‌ను లాంచ్ చేయబోతోంది. జనవరి 9న మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది ఈ సరికొత్త గేమ్. ఇంతవరకూ సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్‌లో ఇది ఓ కొత్తదనం. ఇప్పటికే ఈ గేమ్‌కి సంబంధించిన ట్రైలర్‌ని యూ ట్యూబ్‌లో ఉంచారు. ఈ ట్రైలర్‌కి వచ్చే రెస్పాన్స్ అదిరిపోతోంది. మెగాస్టార్ సినిమా అన్నాక యూ ట్యూబ్ వీవర్స్‌కి పండగే పండగ అయిపోయింది. రోజూ ఏదో ఒక కొత్తదనంతో యూ ట్యూబ్ హిట్స్ పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటిదాకా 'ఆడియో సింగిల్స్' రచ్చ రచ్చ అయిపోగా, ఇప్పుడు ఈ కొత్త గేమ్‌తో మెగా సందడి చేస్తోంది. ఈ న్యూస్ బయటికి రాగానే మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ గేమ్ మార్కెట్‌లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ చిరంజీవి చేసిన సినిమాల్లోని పాత్రలను ఏనిమేషన్ చేసి అడ్వెంచర్స్ ఆఫ్ జర్నీ అంటూ ఈ గేమ్ రన్ అవుతోంది.