బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ 'ఎన్టీఆర్' బయోపిక్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ భామ అయినప్పటికీ, బాలీవుడ్ సినిమాలతో ఏ కొద్ది పరిచయమున్న తెలుగు ప్రేక్షకులకైనా విద్యాబాలన్ టాలెంట్ గురించి తెలియకుండా ఉండదు. ఇక డైరెక్ట్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాక, సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, ఆమె తెలుగు వారి అభిమానాన్ని విశేషంగా చూరగొంది. ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతమై ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. దురదృష్టవశాత్తూ ఈ సినిమాలు సక్సెస్ కాకపోయిననా, విద్యాబాలన్ టాలెంట్ మాత్రం అందరికీ అర్ధమైపోయింది. దాంతో ఆమెను తెలుగులో మరిన్ని సినిమాల్లో చూడాలనుకుంటున్నారు. కానీ విద్యాబాలన్‌తో కమర్షియల్‌గా వర్కవుట్ కాదు.
ఇంపార్టెంట్ రోల్స్, ప్రాధాన్యత ఉన్న రోల్స్ అయితే విద్యా ప్రాణం పెట్టేస్తుంది. మరి ఆ యాంగిల్‌లో నటించేందుకు విద్యా ఒప్పుకుంటుందో లేదో చూడాలిక. ఇదిలా ఉంటే, తమిళంలోనూ విద్యాబాలన్ ఓ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌లో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పింక్'కి తమిళ రీమేక్ ఇది. 'నేర్కొండ పార్వై' అనే ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్నారు. అజిత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో సౌత్‌లో విద్యాబాలన్ మరిన్ని వరుస అవకాశాలు దక్కించుకోవడం ఖాయమంటున్నాయి సౌత్ ఫిలిం వర్గాలు. మంచి కథలు దొరికితే, సౌత్‌లో ఫిక్స్ అయిపోవడానికి కూడా విద్యాబాలన్ సిద్ధంగానే ఉందట. అలా అని బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలేం తగ్గిపోలేదండోయ్. అక్కడ అక్కడే, ఇక్కడ ఇక్కడే. గోన గన్నారెడ్డిలా ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. అంటోంది విద్యాబాలన్.