నిన్న గణేష్... నేడు అమిత్?!

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఆఖరి అంకానికి వచ్చేసింది. 106 రోజుల ఈ సీజన్ లో 83 రోజులు గడిచిపోగా షో లో ఎవరు విజేతలు అవుతారు అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ఈ తరుణంలో డబల్ ఎలిమినేషన్ తో ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి ఇద్దరు వేల్లిపోనున్నారు. ఇప్పటికే నిన్న గణేష్ వెళ్ళిపోగా ఈరోజు మరొక ఇంటి సభ్యుడు ఇంటిని వదిలేయనున్నాడు. అయితే అలా ఈరోజు ఇంటి నుండి నిష్క్రమించే సభ్యుడు అమిత్ అన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.

దీనికి సంబంధించిన వార్తలు గత రెండు మూడు రోజుల నుండి అంతర్జాలంలో వైరల్ అవ్వగా ఈ అంశం పైన ఈరాత్రికి ఒక క్లారిటీ రానుంది. అమిత్ ఎందుకు వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నారు అంటే- ఆయన ఇప్పటివరకు హౌస్ లో సేఫ్ గేమ్ పేరుతో అసలు ఆయనలోని ఎమోషన్స్ ని బయటపెట్టకపోవడం వంటి వాటితో ఆయనకి ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉండడమే.

మరి అందరూ ఊహిస్తునట్టుగా అమిత్ వెళతాడా లేక మరెవరైనా వెళ్ళిపోతారా అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS