నాని 'గ్యాంగ్‌'లోని ఆ ఐదుగురు లేడీస్‌ ఎవరబ్బా!

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని ఐదుగురు లేడీస్‌ గ్యాంగ్‌కి లీడర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాకి సంబంధించిన ప్రీ లుక్‌ విడుదల చేశారు. ఈ లుక్‌లో ఐదుగురు లేడీస్‌ చేతులు ఒకదానిపై ఒకటి ఉంచగా, వారందరికీ అభయంహస్తం ఇస్తున్నట్లుగా ఆ ఐదు చేతుల కిందా నాని చేయి ఉన్న ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 'గ్యాంగ్‌లీడర్‌' అన్న టైటిల్‌కి యాప్ట్‌గా, ఈ ఐదుగురు లేడీస్‌ గ్యాంగ్‌కి మనోడు లీడర్‌ అన్న మాట అనే హింట్‌ మాత్రమే ప్రస్తుతానికి చిక్కింది.

 

ఫస్ట్‌లుక్‌ వస్తే తప్ప, అసలింతకీ ఈ ప్రీ లుక్‌లో ఉన్న ఆ ఐదుగురు లేడీస్‌ ఎవరు? ఎందుకు వీరిలా గ్యాంగ్‌లా ఫామ్‌ అవ్వాల్సి వచ్చింది? నాని ఎందుకు వారికి అండగా ఉండాల్సి వచ్చింది? అనే విషయాలు తెలియరావు. ఈ రోజు ప్రీ లుక్‌ రిలీజ్‌ చేసి, మళ్లీ ఎప్పుడో ఫస్ట్‌లుక్‌, ఆ తర్వాత ఇంకెప్పుడో టీజర్‌ రిలీజ్‌ చేయడం కాదంట. కంటిన్యూస్‌గా అప్‌డేట్స్‌ ఇస్తేనే కిక్‌ ఉంటుంది. సో మా 'గ్యాంగ్‌లీడర్‌'కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ప్రీ లుక్‌తో స్టార్ట్‌ చేసి, టీజర్‌ వరకూ వరుసగా రిలీజ్‌ చేయబోతున్నామని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు మంచి ముహూర్తాలు కూడా ఫిక్స్‌ చేసుకున్నారు.

 

15న ఫస్ట్‌లుక్‌, 18న ఫస్ట్‌ సాంగ్‌, 24న టీజర్‌ ఇలా కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఇన్ని అప్‌డేట్స్‌ ఇవ్వనున్నారట నాని అండ్‌ టీమ్‌. ఇవన్నీ రిలీజ్‌ అయ్యేసరికి సినిమాపై ఫ్యాన్స్‌కి ఓ ఐడియా వచ్చేస్తుంది. డిఫరెంట్‌ డిఫరెంట్‌ ఏజ్‌ గ్రూప్స్‌లో నాని ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే ప్రచారం ఆల్రెడీ ఎప్పటి నుండో జరుగుతోంది. 'గ్యాంగ్‌లీడర్‌' అనే టైటిల్‌ పెట్టుకుని, 'జెర్సీ'తో ముందు హిట్‌ కొట్టి, విక్రమ్‌ కుమార్‌లాంటి డైరెక్టర్‌, మైత్రీ మూవీస్‌ లాంటి నిర్మాణ సంస్థ సపోర్ట్‌తో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో నాని ఎలాంటి మ్యాజిక్‌ చేయనున్నాడో తెలియాలంటే, రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS