ముద్దులే ముద్దులు.. అంటోన్న కన్నడ కుట్టీ!

మరిన్ని వార్తలు

రష్మికా మండన్నా అంటే ఇప్పుడో సెన్సేషన్‌. సోషల్‌ మీడియాలో రష్మికా సాదా సీదాగా ఉన్న ఫోటో పోస్ట్‌ చేసినా, ఆ ఫోటోకి ఎన్ని లైకులో, ఎన్ని కామెంట్లో. అలాంటిది రష్మికా ఏదైనా బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందంటే ఇంకేమైనా ఉందా? ఇంతకీ రష్మికా ఏం చెప్పిందంటారా? ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌'లో పుష్కలంగా లిప్‌లాక్స్‌ ఉన్నాయనీ చెప్పుకొచ్చింది. చెప్పడమేంటీ? ట్రైలర్‌లో ఆల్రెడీ చూసేశాం కదా! అనుకుంటున్నారా? అవే కాదండోయ్‌.. సినిమాలో ఇంకా చాలా చాలా ముద్దు సీన్లున్నాయట.

 

కోపం, బాధ వంటి ఎమోషన్స్‌లాగానే ముద్దు కూడా ఓ ఎమోషన్‌ అని రష్మికా ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు మరి. చెబితే చెప్పింది కానీ, ఈ ఒక్క మాట చాలదూ 'డియర్‌ కామ్రేడ్‌' సూపర్‌ సెన్సేషన్‌ కావడానికి. ఆమెకు తొలి బ్లాక్‌ బస్టర్‌ అయిన 'గీత గోవిందం'లోనూ బస్‌లో లిప్‌లాక్‌ సీన్‌ ఉంది. కానీ, ఎందుకో ఆ సీన్‌ని సినిమా నుండి తొలగించి క్లీన్‌ మూవీలా చూపించారు. కానీ, ఆ టైప్‌ ముద్దు సీన్లు పుష్కలంగా వాడేశారట 'డియర్‌ కామ్రేడ్‌' కోసం. అసలే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌.

 

ఇక ముద్దు సీన్ల కోసం ఈ అమ్మడు చెప్పిన మాట ఒక్కటి సినిమా ప్రమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లిపోయింది. అంతేకాదండోయ్‌ ఈ సినిమాలో రష్మికది ఏదో ముద్దుల కోసమే నటించే ముద్దుగుమ్మ పాత్ర కానే కాదు. పర్‌ఫామెన్స్‌కి బోలెడంత స్కోపున్న పాత్ర. క్రికెట్‌ ప్లేయర్‌గా రష్మికా కనిపించబోతోంది ఈ సినిమాలో. ఆమె ఎమోషనల్‌ డైలాగులూ, క్యాజువల్‌గా కథలో మిళితమై వచ్చేసే లిప్‌లాకులూ వెరసి, ఈ సినిమా సక్సెస్‌కి రష్మికా పాత్ర ప్రాధాన్యత సంతరించుకోదగ్గదే అనడం అతిశయోక్తి కాదేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS