నేచురల్ స్టార్ నుండి రొటీన్ స్టార్ గా మారిన నాని 'జెర్సీ' చిత్రం తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు. ఇది తేలాలంటే నాని తాజా చిత్రం 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ వరకు వేచి చూడాలి. కానీ ఇప్పట్లో ఇది తేలేలా కనిపించడం లేదు. నాగార్జున తో 'మనం' మరియు సూర్య తో '24' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన 'విక్రమ్ కుమార్' దర్శకత్వం లో వస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్.
మొదట ఈ చిత్రం ఆగస్టు నెలాఖరున విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ సాహో చిత్రం రిలీజ్ డేట్ కూడా ఆగస్టు 30న ఫిక్స్ అవ్వడంతో నాని వెనక్కి తగ్గాడు. గత చిత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ బడ్జెట్ లో చిత్రీకరించడం వలన నాని సోలో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. కానీ నానికి పోటీ తప్పేలా లేదు.
గ్యాంగ్ లీడర్ ఆగష్ట్ నుండి సెప్టెంబర్ లో విడుదల చేద్దామన్నా..మెగా హీరో 'వరుణ్ తేజ్' 'వాల్మీకి' సెప్టెంబర్ 13న డేట్ లాక్ చేసుకున్నాడు.. పోనీ అక్టోబర్ లో రిలీజ్ చేద్దామన్నా మెగా స్టార్ చిరంజీవి 'సైరా' తో సై అంటున్నాడు. అందుకని ఇటు 'సాహో' అటు 'సైరా' తో పోటీపడటం కంటే మధ్యలో వరుణ్ తేజ్ తో రంగంలోకి దిగితే సరి అనుకుంటున్నారు చిత్ర నిర్మాతలు. ఈ విషయమై 'వాల్మీకి' నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం..మొత్తానికి నానికి మెగా హీరోలతో పోటీ తప్పేటట్లు లేదు.