'మన్మధుడు 2' ట్రైలర్‌తో నాగార్జున ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తున్నాడు కానీ, ఇంటి సభ్యుల్ని మాత్రం ఇంప్రెస్ చేయలేకపోతున్నాడంట. ముఖ్యంగా సమంతను ఇంప్రెస్ చేయలేకపోయానంటూ స్వయంగా ఆయనే ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రైలర్ విడుదలయ్యాక, కోడలు సమంతను ట్రైలర్ ఎలా ఉందమ్మా.. అని అడిగితే, 'ఇదేం ట్రైలర్ మామా..?' అంటూ అదో రకం ఎక్స్‌ప్రెషన్ పెట్టిందట.
అయితే, ట్రైలర్‌లో నన్ను మామగారిలా కాకుండా, ఓ నటుడిగా మాత్రమే చూడమని చెప్పగా, అప్పుడు ఓకే అన్నదట సమంత. ట్రైలర్‌లో సమంతకు నచ్చలేనంతగా ఏమున్నాయంటే, హద్దులు మీరిన ఆ ముద్దు సీన్లేనట. అయితే, అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ అని సమంతను అడిగితే, ఇంకెవరికి మామగారికే.. అని ఠక్కున చెప్పేసింది. మరి అంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు 'మన్మధుడు 2'లో ఆయన ముద్దు సీన్లలో నటిస్తే సమంత ఎందుకు మెచ్చలేకపోయింది.. అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్రైలర్ వచ్చాక, కొందరు ఆడియన్స్ నుండి కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు నాగ్. ఆ విమర్శలపై తాజా ఇంటర్వ్యూస్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాని చాలా సెన్సిబుల్‌గా డీల్ చేశామని, సినిమా మొత్తం చూశాక, ఎక్కడా విమర్శించడానికేమీ ఉండదనీ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు నాగార్జున. ఈ సినిమాలో సమంత గెస్ట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.