గ్యాంగ్‌లీడర్‌ ట్రైలర్‌ టాక్‌: యాక్షన్‌ ప్యాక్‌డ్‌ కామెడీ.

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని తాజా చిత్రం 'గ్యాంగ్‌లీడర్‌' ట్రైలర్‌ విడుదలైంది. 'మొదటిసారి పెన్సిల్‌ రాసిన ఒరిజినల్‌ స్టోరీ..' అనే క్యాప్షన్‌తో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో నాని పేరు 'పెన్సిల్‌' అని టీజర్‌లోనే తెలుసుకున్నాం. ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే, హాలీవుడ్‌ సినిమాలు కాపీ కొట్టి, రివేంజ్‌ స్టోరీలు రాసేసే రైటర్‌గా చూపించారు. అలా ఆయన వద్దకు వచ్చిన ఐదుగురు ఆడాళ్లు, నాని సాయంతో, తమ పగ తీర్చుకుంటూ ఉంటారు.

 

అలా నాని స్టైల్‌ కామెడీతో స్టార్ట్‌ అయిన ట్రైలర్‌, సడెన్‌గా యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేం కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. విలన్‌గా కార్తికేయ అప్పియరెన్స్‌ సినిమాకి ఖచ్చితంగా హైలైట్‌ అయ్యేలానే ఉంది. 'ఐదుగురు ఆడాళ్లు వాళ్లతో ఒకడు..' అని కార్తికేయ చెప్పే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ ట్రైలర్‌కి హైలైట్‌ అయ్యింది. ట్రైలర్‌ చివర్లో నేనింకా 'కిల్లర్‌ సిట్యువేషన్‌లోనే ఉన్నా, సైకో కిల్లర్‌ని చేసేలోపే మొదలెట్టేద్దాం..' అని సీరియస్‌గా డైలాగ్‌ చెబుతూ, హీరో, విలన్‌ ఇద్దరూ చేతిలో ఆయుధాలు పట్టుకుని గాల్లో ఎగిరే యాక్షన్‌ సీన్‌తో ట్రైలర్‌ కట్‌ చేశారు.

 

సో టోటల్‌గా ట్రైలర్‌ చూస్తుంటే, ఫుల్‌ ఫన్‌ అండ్‌ యాక్షన్‌తో ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌ ప్రియాంక మోహనన్‌ అందంగా కనిపిస్తోంది. అసలింతకీ, ఈ ఐదుగురు ఆడవాళ్లు, తమ గ్యాంగ్‌ లీడర్‌ నానితో కలిసి ఏం రివేంజ్‌ తీర్చుకోబోతున్నారో తెలియాలంటే, సెప్టెంబర్‌ 13 వరకూ ఆగాల్సిందే. అదే రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS