కొత్త సినిమా షురూ చేసిన శర్వానంద్‌.

By Ramesh - August 28, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో శర్వానంద్‌ కొత్త సినిమా షురూ చేశాడు. శ్రీ కార్తిక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో 'పెళ్లి చూపులు' ఫేమ్‌ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే కథనంతో ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌ మూవీగా రూపొందిస్తున్నారు.

 

ఇటీవలే 'రణరంగం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్‌. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా పోజిటివ్‌ టాక్‌నే తెచ్చుకుంది. కాజల్‌, కళ్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్లుగా నటించారు. మరోవైపు శర్వానంద్‌ తమిళ రీమేక్‌ '96'లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత, శర్వానంద్‌కి జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది ఈ సినిమా. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, స్టార్ట్‌ చేసేయడం ఫాస్ట్‌ ఫాస్ట్‌గా జరిగిపోయాయి.

 

ఏడాదికి ఒక్క సినిమా కాదు, రెండు, మూడు సినిమాలు చేసే అలవాటున్న శర్వానంద్‌కి ఈ తాజా సినిమా ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో చూడాలి మరి. ఇక హీరోయిన్‌ రీతూవర్మ విషయానికి వస్తే, తొలి సినిమాతో హీరోయిన్‌గా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఆ తర్వాత 'కేశవ' తదితర చిత్రాల్లో నటించింది. ఈ మధ్య తెలుగులో ఎక్కడా కనిపించడం లేదు. తమిళంలో బిజీగా ఉంది. శర్వానంద్‌కి జోడీగా తాజా సినిమాతో ఈ నేచురల్‌ బ్యూటీ మళ్లీ తెలుగులో బిజీ కానుందేమో చూద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS