ఈ సీజన్ బిగ్‌బాస్‌కి సంబంధించి, బిగ్‌బాస్ వీక్షకుల నుండి, మిస్టర్ పర్‌ఫెక్ట్ అనే ముద్ర వేయించుకున్నాడు రాహుల్. బయట మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకున్నాడంటే, ఆటోమెటిగ్గా హౌస్‌లో మిస్టర్ వేస్ట్ అనిపించుకుంటాడు. అందరికీ సింపుల్‌గా టార్గెట్ అవుతాడు. గత సీజన్‌లో కౌషల్‌ని హౌస్ మేట్స్ అలాగే ట్రీట్ చేశారు. ఈ సీజన్‌కొచ్చేసరికి రాహుల్ హౌస్‌లో అదే సిట్యువేషన్ ఎదుర్కొంటున్నాడు. దోస్తానా.. అంటూనే రాహుల్ వెనక గోతులు తవ్వేస్తుంటారు. బేసిగ్గా రాహుల్ కొంచెం షై. మస్త్ మొహమాటస్థుడు.
యాక్షన్ ఏదైనా, సరే, ఆయన రియాక్షన్ ఒక్కటే పెదాలపై చిరునవ్వు. కానీ, హౌస్‌లో ఈ మధ్య రాహుల్ విషయంలో చోటు చేసుకున్న పలు అంశాలు ఆయన్ని మెంటల్‌గా డిజప్పాయింట్ చేస్తున్నాయి. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండీ, రాహుల్ నామినేట్ అవుతూనే వస్తున్నాడు. ఎట్టకేలకు రాహుల్‌కి ఇమ్యూనిటీ దొరికే ఛాన్స్ వచ్చింది ఈ వీక్ నామినేషన్స్‌లో. ఇమ్యూనిటీ అయితే దొరికింది కానీ, అందుకోసం రాహుల్ చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. హౌస్‌మేట్స్ కోపాలు, తాపాలు, గొడవలు.. బతిమలాడుకోవడాలు, కాళ్లు పట్టుకోవడాలు.. ఇలా ఒక్కటేంటీ. ఎన్ని చేయాలో, ఎంత చేయకూడదో అంతా చేసేశాడు పాపం రాహుల్.
రాహుల్‌తో పాటు ఇమ్యూనిటీ కోసం ట్రై చేసిన వరుణ్, రవి విషయంలో హౌస్ మేట్స్ కో ఆపరేషన్ ఉండడంతో వారికిచ్చిన టాస్క్‌లు ఈజీగా పూర్తి చేయగలిగారు. కానీ, రాహుల్‌కిచ్చిన టాస్క్ మాత్రం కనా కష్టంగా ముగిసింది. పైన చెప్పుకున్నాం కదా.. కాళ్లు పట్టుకోవడం వరకూ వెళ్లిందంటేనే రాహుల్ తన టాస్క్ (హౌస్‌మేట్స్‌తో గొడవ పెట్టుకోవడం, వితికా - వరుణ్ హార్ట్ షేప్ పిల్లో కట్ చేయడం) కంప్లీట్ చేసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.