తమ ఫిలిం యూనిట్ విదేశాల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది అంటూ ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు.
వివరాల్లోకి వెళితే, గౌతమ్ మీనన్ తన చిత్ర యూనిట్ టర్కీ దేశం సరిహద్దుల్లో గత 24 గంటల నుండి చిక్కుకున్నట్టు, తమవాళ్ళ వద్ద సరైన ధ్రువ పత్రాలు ఉన్నపట్టికి అక్కడి అధికారులు తమ యూనిట్ మెంబర్స్ వద్ద ఉన్న కెమెరాలని , వేరే సామగ్రిని అనుమతించడం లేదు అని తెలిపాడు.
దయచేసి ఈ విషయాన్ని సంబధిత అధికారులకి చేరేవేసేలా చూడమని అందరిని కోరుతున్నాడు. దీనితో అందరు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కి ఈ అంశాన్ని సోషల్ మీడియా ద్వారా పంపుతున్నారు.