గాయత్రీ చిత్రం విడుదలకి సమయం సమీపిస్తున్న కొద్ది ఆ చిత్రానికి సంబందించిన విషయాలు ఒక్కొకటిగా బయటకి వస్తున్నాయి. అందులో భాగంగా ఈ చిత్రానికి సంబందించిన క్లైమాక్స్ గురించి రకరకాల వార్తలు బయట చక్కర్లు కొడుతున్నాయి.
అసలు వివరాల్లోకి వెళితే, గాయత్రీ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ పార్ట్ చాలా కీలకం అట. అందుకోసమే ఈ భాగం చిత్రీకరించడానికి 1 కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టారట. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ కనల్ కన్నన్ ఈ పోరాట సన్నివేశాలు డైరెక్ట్ చేశారట, ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకమైన సెట్స్ కూడా వేశారట.
ఇదిలావుండగా మోహన్ బాబు ఈ సినిమాలో పలికిన డైలాగ్స్ ఇప్పటికే ఈ చిత్రం పైన అంచనాలు పెంచేస్తున్నది. అలాగే ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలు పోషించిన మోహన్ బాబు ఈ చిత్రం మొత్తానికే హైలైట్ అన్నది ఇప్పుడు ఫిలిం నగర్ లో టాక్.
చూద్దాం.. మోహన్ బాబు డూప్ కూడా లేకుండా చేసిన ఫైట్స్ తెరపైన ఎలా కనిపించనున్నాయో..