కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన తాజా చిత్రం గాయత్రీ విడుదల సందర్భంగా ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నుండి కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబందించిన విషయాలు ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారాయి.
ఆ విషయలేంటంటే- పది సంవత్సరాల క్రితం చిరంజీవికి పద్మ భూషణ్ వచ్చినప్పుడు సినీ పరిశ్రమ ఆయనని సత్కరించే సందర్భంలో మోహన్ బాబు తన ప్రసంగంలో చిరంజీవి పైన కొన్ని సెటైర్లు వేయడం అందుకు సమాధానంగా పవన్ కళ్యాణ్ తమ్ముడు మోహన్ బాబు అంటూ అనడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
ఇదే అంశాన్ని సదరు యాంకర్ ప్రస్తావించడం అలాగే అప్పుడు మోహన్ బాబు ఆ కామెంట్ కి స్పందించకపోవడానికి కారణం- ఆయన గురువు గారు అయిన ‘దాసరి నారాయణరావు’ నువ్వు స్పందించకు అని చెప్పడంతోనే తాను మౌనం వహించినట్టు చెప్పాడు.
తరువాతకాలంలో ఎవరు చేసినదానికి వారే అనుభవిస్తారు అన్న ధోరణిలోనే తాను ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు అని చెప్పుకొచ్చాడు.