ఈ మధ్య యంగ్ హీరోల సినిమాలు మంచి విజయం అందుకుంటున్నాయి. కొత్త నటీనటులతోనూ కొత్త దర్శకుడితో రూపొందిన 'ఆర్ ఎక్స్ 100' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకోవడంతో పాటు, భారీ వసూళ్లు కూడా సాధించింది. ఆ తర్వాత అందరికీ సుపరిచితుడైన యంగ్‌స్టర్ అడవిశేష్ హీరోగా రూపొందిన 'గూఢచారి' చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా కొల్లగొడుతోంది.
ఇప్పుడు గూఢచారి సినిమా ని కొల్లగొట్టేలా 'గోవిందం' వచ్చాడు. అదే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' చిత్రంతో వెరీ లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ ఓపెనింగ్స్ అందుకుంటోందీ సినిమా. దాంతో 'గూఢచారి' వసూళ్లకు గండి పడ్డట్లైంది. అయినప్పటికీ, ఈ చిత్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు 'గోవిందం' రాకతో కాస్త స్లో అయ్యింది.
ఇకపోతే 'గీత గోవిందం' విషయానికి వస్తే, ఈ సినిమాపై విడుదలకు ముందే బిగ్ హైప్ క్రియేట్ అయ్యింది. విడుదలయ్యాక ఆ అంచనాలను అందుకునే దిశగానే ఫస్ట్‌డే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ప్రివ్యూ షోలతోనే భారీ వసూళ్లు రాబట్టేసింది. దాదాపు 3 కోట్ల వరకూ ప్రివ్యూల ద్వారా సాధించిందనీ యూఎస్ ట్రేడ్ పండితుల ద్వారా అందుతోన్న సమాచారమ్. టోటల్‌గా ఫైనల్ రిజల్ట్ కౌంట్ తెలియాలంటే సోమవారం దాకా ఆగాల్సిందే.
విజయ్ దేవరకొండ - రష్మికా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం బన్నీ వాస్ నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పణలో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది.