తమిళ ముద్దుగుమ్మ జ్యోతికకు తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి ఫాలోయింగ్ సంపాదించింది. చిరంజీవి, రవితేజ తదితర స్టార్ హీరోల సరసన తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది జ్యోతిక. తమిళ హీరో సూర్యని పెళ్లి చేసుకుని సెటిలయ్యాక తెలుగులో సినిమాలు చేయలేదు.
తమిళంలోనూ ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది జ్యోతిక. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా జ్యోతిక హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌కే ప్రాధాన్యత ఇస్తోంది. ఆ కోవలో తాజాగా తమిళంలో విడుదలైన జ్యోతిక చిత్రం 'నాచియార్' మంచి విజయం అందుకుంది. ఆ సినిమానే ఇప్పుడు తెలుగులో 'ఝాన్సీ' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. బాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం జ్యోతికకు తెలుగులోనూ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నారు.
పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో జ్యోతిక కనిపిస్తోంది ఈ సినిమాలో. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఆలాంటి విపత్కర పరిస్థితులను మహిళలు ఎలా ఎదుర్కోవాలనే అతి కీలకమైన అంశాలను ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. జి.వి.ప్రకాష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇంతవరకూ కొంచెం క్యూట్ అండ్ కొంచెం హాట్‌గా కనిపించిన జ్యోతికను 'ఝాన్సీ' సినిమాతో పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ లుక్‌లో చూడబోతున్నామన్న మాట.